top of page

ఒక్క ఫొటోతో చర్మ సమస్యలపై పూర్తి సమాచారం..📲💡

అందుబాటులోకి వస్తున్న అ‍త్యాధునిక సాంకేతికత మనిషికి అనేక సౌలభ్యాలను తెచ్చిపెడుతోంది. అరచేతిలో ఇమిడిపోతున్న స్మార్ట్‌ ఫోన్‌ సాయంతో అన్ని సమకూరుతున్నాయి. అందులోని గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఎంతలా ప్రయోజనం చేకూరుస్తుందో అందరికీ తెలిసిందే.

అయితే గూగుల్‌లోని మరో ఫీచర్‌ గూగుల్‌ లెన్స్‌. ఇది సాధారణ చిత్రాలను నెట్‌లో సెర్చ్‌ చేయడానికి ఉపకరిస్తుంది. మనం ఏదైనా ఫోటోలో గూగుల్‌ లెన్స్‌ లో అప్‌ లోడ్‌ చేస్తే అది దానికి సంబంధించిన ఇతర చిత్రాలతో పాటు దానికి సంబంధించిన వివరాలను మనకు చూపిస్తుంది. ఉదాహరణకు మీకు ఏదైనా ఒక వస్తువు నచ్చిందనుకోండి.. దానిని ఫొటో తీసి గూగుల్‌ లెన్స్‌లో అప్‌ లోడ్‌ చేస్తే చాలు. దాని పుట్టుపూర్వోత్తరాలు బయటకు తీస్తుంది. అది ఎక్కడ దొరకుతుంది? దాని ధర ఎంత? దానికి సంబంధించిన ఇతర మోడళ్లు ఏమున్నాయి వంటి వన్నీ చూపిస్తుంది. ఇప్పుడు దీనిని చర్మవ్యాధులను గుర్తించడానికి కూడా ఉపయోగించవచ్చని గూగుల్‌ ప్రకటించింది. గూగుల్‌ లెన్స్‌ ద్వారా ఇప్పుడు మీ శరీరంపై ఉన్న మచ్చలు, ర్యాష్‌లు, మొటిమల వంటి వాటి గురించి గూగుల్‌ లెన్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. వాటి చిత్రాలను గూగుల్‌ లెన్స్‌ ద్వారా స్కాన్‌ చేస్తే దాని పరిస్థితి ఏంటి అనేది చెప్పేస్తుంది. సాధారణంగా చర్మంపై దద్దర్లు, మచ్చలు ఎలా వచ్చాయి అనేది చెప్పడం కష్టమే. శరీరంపై ఏ భాగంలో ఎలాంటి మచ్చలు, మొటిమకలు, ర్యాష్‌లు, వాపు ఉన్నా వాటి గురించి తెలుసుకోవచ్చు.✨


bottom of page