top of page

మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో వచ్చేసిన గూగుల్ పిక్సెల్ 8 మోడల్స్.. పూర్తి వివరాలివే..📱

స్మార్ట్‌ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెస్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్ల విక్రయం ప్రారంభమైంది. మేడ్ బై గూగుల్ 2023 హార్డ్ వేర్ లాంచ్ ఈవెంట్‌లో బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్లనువ ఇడుదల చేసింది. టెన్సర్ G3 చిప్ ఆధారితంగా పని చేసే ఈ ఫోన్.. 256 జీబీ ఇంటర్నల్ స్టోరీజిని కలిగి ఉన్నాయి.స్మార్ట్‌ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ పిక్సెస్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. 📱

ఇండియన్ మార్కెట్‌లో ఈ ఫోన్ల విక్రయం ప్రారంభమైంది. మేడ్ బై గూగుల్ 2023 హార్డ్ వేర్ లాంచ్ ఈవెంట్‌లో బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్లనువ ఇడుదల చేసింది. టెన్సర్ G3 చిప్ 🔋ఆధారితంగా పని చేసే ఈ ఫోన్.. 256 జీబీ ఇంటర్నల్ స్టోరీజిని కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తో ఇది పని చేస్తుంది. ఇక పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండూ ఫోటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి గూగుల్ ఏఐ ఫీచర్స్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫీచర్స్‌ను ఏడేళ్లపాటు గూగులే అందించనుంది. ఈ ఫోన్‌, కెమెరా పూర్తిస్థాయిలో AI టెక్నాలజీ ఆధారితంగా వర్క్ చేస్తుందని పేర్కొంది గూగుల్. భారతదేశంలో పిక్సెల్ 8 ధర రూ. 75,999గా నిర్ణయించడం జరిగింది. ఇదే ఒకే 128 జీబీ స్టోరేజ్ మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హాజెల్, అబ్సిడియన్, రోజ్‌ కలర్‌ ఆప్షన్‌లలో విక్రయించడం జరుగుతుంది. ఇక పిక్సెల్ 8 ప్రో 128 జీబీ మోడల్‌ రూ. 1,06,999 గా నిర్ణయించారు. ఈ ప్రో మోడల్ బే, ఆబ్సిడియన్ రంగులో వస్తుంది. ఈ మొబైల్స్ ప్రముఖ ఈ కామర్స్ 📷 సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్‌లు అక్టోబర్ 4వ తేదీ నుంచే ప్రారంభం అయ్యాయి. ఇకపోతే.. మొదటిసారిగా గూగుల్ తన స్మార్ట్‌వాచ్, పిక్సెల్ వాచ్ 2 ని ఇండియాలో రిలీజ్ చేసింది. ఇది అక్టోబర్ 12 నుంచి అందుబాటులోకి రానుండగా.. దీని ధర రూ. 39,900 గా నిర్ణయించారు.📱


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page