📱 మొబైల్ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారా.. అయితే మీ గుట్టు మొత్తం రట్టయినట్టే అంటోంది గూగుల్. 😎 అవును ఇటీవల గూగుల్ తీసుకొచ్చిన AI జెమినీ యాప్‌లో మీ వ్యక్తిగత వివిరాలు ఎంటర్ చేయొద్దని సూచించింది. 🤖 అలా చేస్తే మీ వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది. 🚨
మొబైల్ వినియోగదారులకు ఛాట్ జీపీటీ ఉపయోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు పలు కంపెనీలు ఏఐ యాప్ లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయని గూగుల్ తెలిపింది. 📢 ప్రస్తుతం తమ ఏఐ యాప్ జెమినీ పైలట్ ప్రాజెక్టుగా పరిశీలన దశలో ఉందని తెలిపింది. 🕵️♂️ ఈ యాప్ పరిశీలనలో బయటపడిన వివరాలను పరిశీలించి ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ఓ వార్నింగ్ ఇష్యూ చేసింది. 🚨 మొబైల్ వినియోగదారుల కోసం తయారుచేసిన AI యాప్ లలో డాటా చాలా రోజుల పాటు ఉండిపోతుందని గూగుల్ పేర్కొంది. 📅 జెమినీ యాప్ లో అయితే మూడేళ్ల పాటు ఆ డాటా డిలీట్ కాదని తెలిపింది. 🗑️ యాప్ మొత్తాన్నీ డిలీట్ చేసినా సరే గతంలో మీరు నమోదు చేసిన వివరాలు తొలగిపోవని వివరించింది. 🚫 దీనికి కారణం.. ఏఐని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చేసిన ఏర్పాట్లేనని వెల్లడించింది. 🔄 జెమినీ యాప్ లో ఎంటర్ చేసే వివరాలను యాప్ మరోచోట స్టోర్ చేస్తుందని, దాంతో యాప్ కు కానీ అప్పటి వరకు మీరు చేసిన చాటింగ్ కు కానీ లింక్ ఉండదని గూగుల్ తెలిపింది. 🔗 యాప్ నుంచి సేకరించిన సమాచారాన్ని మూడేళ్ల పాటు నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. 📊 అంతేకాదు, జెమినీ యాప్ లో కూడా దాదాపు 72 గంటల పాటు డాటా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయని చెప్పింది. ⏳ అంటే.. మీ చాటింగ్ పూర్తయిన తర్వాత మెసేజ్ లను డిలీట్ చేసినా సరే 72 గంటల వరకు ఆ డాటా మొత్తం స్టోరేజ్ లో ఉంటుందని గూగుల్ తెలిపింది. 🗂️