top of page

🌄🙏 యాదాద్రి వెళ్లే భక్తులకు శుభవార్త.. టెంపుల్ సిటీగా మారుతోన్న పుణ్యక్షేత్రం..

🏞️🛕 పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను యాదాద్రిగా తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 💪 1200 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించారు. 🏛️ ఆలయ అభివృద్ధి కోసం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటిడిఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 🏗️

తిరుమల తరహాలో ఆలయ (టెంపుల్ సిటీ) నగరి కోసం పెద్దగుట్టపై 900 ఎకరాలను సేకరించింది. 🏞️ దేశానికి వన్నె తెచ్చేలా ఆధ్యాత్మిక శోభనిచ్చేలా ఆలయనగరి పేరిట విల్లాలకు వైటీడిఏ రూపకల్పన చేసింది.

🏟️ ఇందులో రహదారుల నిర్మాణం, ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన ప్రాంగణ రూపకల్పనలో దాదాపు 30 ఎకరాల్లో వివిధ పూలు, మొక్కలు, పచ్చదనం పోషణ చేపట్టారు. 🌺 ఇంకా పెద్దగుట్టపై నిర్మిస్తున్న టెంపుల్ సిటీని వైటిడిఏ ఐదు బ్లాకులుగా విభజించింది. 🔀 ఈ బ్లాకుల్లో 252 విల్లాలను నిర్మిస్తారు. 🏘️ ప్రతి విల్లా 900-1000 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు పడకల గదులు ఉండేలా వైటిడిఏ ప్లాన్స్ రూపొందించింది.

💒 పెద్దగుట్టలోని టెంపుల్ సిటీలో విల్లాలు, కాటేజీల నిర్మాణ రూపకల్పన బాధ్యతలు ఢిల్లీకి చెందిన ప్రముఖ కంపెనీ ఆర్కాప్‌ సంస్థ ప్లాన్స్ ను సిద్ధం చేసింది. 🏢 ఈ సంస్థే హైదరాబాద్‌లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కు డిజైన్ చేసింది. 👮 పెద్దగుట్టపై నిర్మింస్తున్న టెంపుల్ సిటీని వైటిడిఏ అంచనా వేసింది.

👷 ఇప్పటికే టెంపుల్ సిటీలోరాష్ట్ర ప్రభుత్వం వైటిడిఏ.. 13 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని కాటేజీలను నిర్మించింది. 🚧 ఈ విలాల నిర్మాణంపై సీఎం కేసీఆర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 🚀 త్వరలోనే విల్లాల నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 🔍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page