top of page
Suresh D

త్వరలో వాట్సప్‌ స్టేటస్‌లో నిమిషం వీడియో

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను అల‌రిస్తున్న వాట్స‌ప్ ఇప్పుడు మ‌రో కీల‌క అప్‌డేట్‌తో వ‌స్తోంది. వాట్స‌ప్‌లో సూప‌ర్ క్లిక్ అయిన స్టేట‌స్ ఫీచ‌ర్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేస్తోంది. స్టేట‌స్‌లో ప్ర‌స్తుతం 30 సెక‌న్ల వీడియో పెట్టుకోవ‌చ్చు. దీన్ని రెట్టింపు చేసి, నిమిషం నిడివి గ‌ల వీడియోను స్టేట‌స్‌లో పెట్టుకోవ‌డానికి వీలుగా కొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది.  ప్ర‌స్తుతం వాట్స‌ప్ 2.24.7.3 వెర్ష‌న్‌కు అప్‌లోడ్ చేసుకున్న‌వారికే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి తేబోతున్నారు. బీటా వెర్ష‌న్ స‌క్సెస్ అయితే త్వ‌రలోనే వాట్స‌ప్ యూజ‌ర్లంద‌రికీ వ‌న్‌మినిట్ వీడియో స్టేట‌స్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంది. 


bottom of page