top of page
Shiva YT

🚗🛣️ హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తీరనున్న ట్రాపిక్ సమస్య..🚗🛣️

🚘🚦ఈ రోడ్డుమార్గంలో కాంక్రీట్ ఫ్లై ఓవర్ కంటే స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మేలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. 2020 జులై 10న శంకుస్థాపన జరిగినా 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్లలో పూర్తైన స్టీల్ బ్రిడ్జి 4 లైన్ల రోడ్ తో ఏర్పాటు చేశారు. 450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 12,500 మెట్రిక్ టన్నుల ఇనుముతో దీన్ని నిర్మించారు.

సన్నటి ఐరన్ పిల్లరు 81 ఉంటే 426 దూలాలు నిర్మించినట్లు ఇంజనీర్లు తెలిపారు. నగరంలో మరో మైలురాయిగా నిలిచే ప్లై ఓవర్ తమ నియోజకవర్గంలో రావడంపై స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ యువజన నాయకులు ముఠా జైసింహా సంతోషం వ్యక్తం చేశారు.🚇🌉

🚇🌉 నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పై నుంచి మెట్రో లైన్ ఉంది. కానీ ఇక్కడ మెట్రో రైలు పై నుంచి ఈ బ్రిడ్జి నిర్మించారు. మెట్రో లైన్ పై నుంచి వెళుతున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై తక్కువ టైంలో పూర్తి చేయొచ్చు. అలాగే మన్నిక కూడా దాదాపు వందేళ్ల పై మాటే అంటున్నారు ఇంజనీర్లు. ఆగస్టు 19 న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. 🚇🌉🛤️🚘

bottom of page