👥 సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే పీఆర్సీతోపాటూ మధ్యంతర భృతి కూడా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వెల్లడిచారు. అలాగే ఉద్యోగులకు మెరుగైన హెల్త్ కార్డు సదుపాయంను కల్పించాలని చూస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ తెలిపారు. అందువల్ల అసెంబ్లీలో పీఆర్సీ, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తారనే టీఎన్‌జీవో నాయకులు అనుకుంటున్నారు.
🗓️ రెండో పీఆర్సీ ఏర్పాటు చేసి.. జులై 1, 2023 నుంచి అమల్లోకి తేవాలనీ, మధ్యంతర భృతిని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ని అభ్యర్థించారు. పీఆర్సీతోపాటూ ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ భీమాలో అవకాశాలు పెంచాలని.. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని, దీంతో మెరుగైన వైద్యం అందేలా ఈహెచ్‌ఎస్‌ను అందించాలని ఉద్యోగుల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం తెచ్చిన పీపీఎస్ పెన్షన్ విధానాన్ని తొలగించి.. ఓపీఎస్‌ను తేవాలని ఉద్యోగులు కోరినట్లు సమాచారం. 📆💼