top of page
Shiva YT

  🇨🇦 కెనడాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త.!🌍

🇨🇦 2024 ఆగస్టుకు కెనడా దేశం.. ఆర్ధిక మాంద్యంలోకి జారిపోనుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటుపడనుంది. 📉 ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, డాలర్‌ విలువ మరింత పడిపోవడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. 🗣️

ఈ తరుణంలో దేశ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. 🌍 ఆ నిర్ణయంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు భారీ ఊరట కలగనుంది. 🌏 ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించేందుకు కెనడా నడుం బిగించింది. 💪 నిబంధనలు పాటిస్తున్నా.. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. 🌐 అయితే.. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేలా వారందరికి పౌరసత్వం ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. 2025 నాటికి 5 లక్షల మందికి వలసదారులను తమ దేశానికి ఆహ్వానిస్తామని అన్నారు. 🌟 జనాభా పెరిగే కొద్ది దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 💼 పలు నివేదికల ప్రకారం.. కెనడాలో సరైన పత్రాలు లేకుండా 3 లక్షల నుంచి 6 లక్షల మంది జీవిస్తున్నారు. 📊 నిబంధనల ప్రకారం.. ఆ డాక్యుమెంట్లు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. 🗓️ లేదంటే వారు సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే కెనడా త్వరలో అమలు చేయనున్న వీసా నిబంధనలతో ..వీసా గడువు ముగియనున్న వర్కర్లకు, విద్యార్ధులకు మరింత లబ్ధి చేకూరనుంది. 💼 డాక్యుమెంట్లు లేని వలసదారులు సిటిజన్‌ షిప్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందేలా రాబోయే క్యాబినెట్ సమావేశాల్లో బిల్లుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. 💼🚀

bottom of page