top of page
MediaFx

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..🌾💸


లోక్ సభ ఎన్నికల ప్రచారాలతో తెలంగాణ హోరెత్తిపోతున్న వేళ.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు వినిపించింది. రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించిన రేవంత్ రెడ్డి సర్కారు.. ప్రస్తుతం ఐదెకరాల పైన భూమి ఉన్న అన్నదాతలకు రైతు బంధు డబ్బులను సోమవారం విడుదల చేసింది. ఈ ఆనందంలో ఉన్న సమయంలో.. సర్కారు మరో శుభవార్త వినిపించింది.

ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగండ్ల వల్ల నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం డబ్బులను విడుదల చేసింది. ఇటీవలే ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వెంటనే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అయితే.. మొన్నటి అకాల వర్షాల కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,814 ఎకరాల్లో 15,246 మంది రైతులు పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. కాగా.. ఈరోజు బాధిత రైతులందరికీ పంట నష్ట పరిహారం కింద ఒక్కో ఎకరాకు రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేసింది.

ఈ మేరకు వ్యవసాయ శాఖ లబ్ధిదారులు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. పంట నష్టపోయి ఆవేదన‌లో తమను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పంట పెట్టుబడి సాయం డబ్బులు పడగా.. వెంటనే నష్ట పరిహారం డబ్బులు కూడా పడటంతో.. రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయిన అప్పులు తీరిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

bottom of page