Good Cholesterol: కొలెస్ట్రాల్ అనగానే మన ఆరోగ్యానికి హాని చేస్తుందని కంగారు పడతాం. మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. గుండె సమస్యలు వస్తాయనే భావనలో ఉంటాం. నిజానికి.. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్(HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL). మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, లివర్‌కు పంపిస్తుంది. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువగా ఉంటే. గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లే. హార్ట్ ఎటాక్ రావడానికి బలమైన కారణం ఎల్‌డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే.