top of page
Suresh D

తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..? 📊💰

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 💼 తాజాగా ఫిబ్రవరి 26న దేశీయంగా బంగారం ధరలు కాస్తంత తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి చూద్దాం..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,480 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940లుగా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,090 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,940 ఉంది.

ఇక బంగారం బాటలోనే వెండి కొనసాగుతోంది. సిల్వర్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.74,800 ఉంది.

అలాగే బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందుకే రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. 💼📊

Comments


bottom of page