✈️ ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల్లో ఎంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా కూడా అక్రమార్కులు ఆగడం లేదు.. రోజు రోజుకు బంగారం అక్రమ రవాణా పెరిగిపోతోంది. గుట్టుగా గోల్డ్‌ను అక్రమంగా తరలించేందుకు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు స్మగ్లర్లు.
👚 ఒంటికి వేసుకుని షర్ట్ బటన్‌లో బంగారం, షూలలో, సూట్ కేసుల్లో.. చివరకు మందు బిల్లలుగా మార్చి కడుపులో దాచుకుని వచ్చిన ఘటనలు కూడా కస్టమ్స్ అధికారులు చేధించారు. ఇలా చిత్ర విచిత్రాలుగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు..గోల్డ్‌ని ఎక్కడా దాచినా కస్టమ్స్ అధికారులు కనిపెట్టేశారు. ఇక తాజాగా పట్టుబడి స్మగ్లర్ మరరో కొత్త పథకం వేశాడు.. వినూత్నంగా ఆలోచించి బంగారంతో చీర తయారుచేశాడు. తన దుస్తుల్లో కలిపేశాడు. అయినప్పటికీ అధికారులకు దొరికిపోయాడు.
🛫 ఆగస్టు 04 శుక్రవారం రోజున శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు చీర పట్టుబడింది. హైదరాబాద్‌లోని ఆర్‌జిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని పట్టుకుని అతని వద్ద నుండి 471 గ్రాముల గోల్డ్ శారీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి బట్టలపై స్ప్రే చేసి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు.