🏦 ఏ బ్యాంకులో అంటే.. 🌍 దేశ వ్యాప్తంగా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక స్కీమ్ ను తీసుకొచ్చింది.
ఈ స్కీమ పేరు బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్. దీని ద్వారా అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు(యూసీబీ)ల్లో గోల్డ్ లోన్ పరిమితిని రెండు లక్షల రూపాయల నుంచి 4 లక్షల వరకూ పెంచింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ కో ఆపరేటిడ్ బ్యాంకుల్లోని కస్టమర్లకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. 💼💳
💼 బుల్లెట్ స్కీమ్ ఇలా.. 📝 ఈ బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద, యూసీబీలు ఇప్పుడు బంగారం తాకట్టుపై వినియోగదారులకు రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వవచ్చు. వినియోగదారులు రుణాన్ని 12 నెలల్లోపు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్య యూసీబీలకు, వారి కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. యూసీబీలు తమ లెండింగ్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోగలుగుతాయి. మరింత ఆదాయాన్ని ఆర్జించగలుగుతాయి, అలాగే కస్టమర్‌లు తక్కువ వడ్డీ రేట్లలో పెద్ద బంగారు రుణాలను పొందగలుగుతారు. ఆర్‌బీఐ నిర్ణయం కూడా ఆర్థిక చేరికను ప్రోత్సహించడానికి, రుణగ్రహీతలకు బంగారు రుణాలను మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది. 💰📈