👩🦰 మహిళలకు షాక్ న్యూస్.. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో బంగారం ధర సుమారు రూ. 1200 మేర పెరిగింది.
ఇక నిన్నటితో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ. 220 పెరిగి.. రూ. 58 వేల మార్క్ దాటింది. మరి మంగళవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
📈 బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 53,350గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి.. రూ. 58,200కి చేరింది. ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్ విషయానికొస్తే.. అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53,500 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 350గా ఉంది. బిజినెస్ క్యాపిటల్ ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,350గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58, 200గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,650గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,530గా ఉంది. బెంగళూరులో అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 53,500.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200గా నమోదైంది. 🪙