top of page
Shiva YT

🌟 గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట.. 🌟

🌍 ప్రస్తుతం భారత దేశంలో పెళ్లిళ్ల సీజన్‌ ఉన్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంతో బంగారం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. అయితే ఈ తగ్గుదల చాలా స్వల్పమే అని చెప్పాలి. 10 గ్రాముల బంగారంపై కేవలం రూ. 10 తగ్గింది. మరి నేడు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 📈

💰దేశ రజాధాన్యి ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,840కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 63,090 వద్ద కొనసాగుతోంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ ర. 58,290, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,590గా ఉంది. బెంగళూరులో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. 💸

🌐 తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. 🌆 మంగళవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా విజయవాడలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,690గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,940 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 🌍

Comments


bottom of page