🏬 హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 63,440 కాగా ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,330కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,150 ఉండగా ఈరోజు
రూ.58,050 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్నటి ధరలతో పోలిస్తే చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ కనిపించడం లేదు. అలాగే స్థిరంగా కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 78,300 కాగా ఈరోజు కేజీపై రూ. 300 తగ్గి 78,000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
🪙 10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర 📍 హైదరాబాద్..రూ. 63,330 📍 విజయవాడ..రూ. 63,330 📍 ముంబాయి..రూ. 63,330 📍 బెంగళూరు..రూ. 63,330 📍 చెన్నై..రూ. 63,820