top of page
Shiva YT

📈🪙 మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

బంగారం కొనాలనుకునేవారికి షాక్‌.. దీపావళి పండగ సందర్భంగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ ఇప్పుడు కొండెక్కుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధర భారీగా పెరిగింది.

గురువారం (నవంబర్‌ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 పలుకుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,190 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్లు రూ.61,040, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది. 📊📉

bottom of page