top of page
Shiva YT

🙏 దేవుళ్లను అపహాస్యం చేస్తున్నారు.. కాంతార2 సినిమాను అడ్డుకుంటాం..!

🎬 రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2022లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఏకంగా 400కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

కాంతార సినిమాలో దైవ నృత్యం భూత కోల గురించి చూపించారు. సినిమా విడుద‌లైన త‌ర్వాత రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు, దేశంలోని ప్ర‌జ‌ల‌కు తుళు దేశంలోని దేవుళ్ల గురించి తెలిసింది. అయితే కొంతమంది దైవ నృత్యంను కించపరిచేలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కొన్ని సీరియల్స్‌లో దేవుడి వేషధారణతో తుళు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని కొందరు విమర్శలు చేశారు. రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో ‘కాంతార 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను అడ్డుకొని తీరుతాం అని కొందరు వార్నింగ్‌ ఇచ్చారు కొందరు.

🌍 తాజాగా ఓ సీరియల్‌లో ఓ నటుడు దేవుడి వేషంలో నటించాడు. దీనిపై ఆందోళనకు దిగిన దైవారాధన సంరక్షణ యూత్ ఫోరం మంగళూరు. బజ్పే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన తుళునాడు దైవారాధన సంరక్షణ యువజన వేదిక నాయకులు కొందరు.. దైవారాదన అనేది డబ్బు సంపాదన వ్యాపారంగా మారిందన్నారు. ‘కాంతార 2’ సినిమాపై కూడా నిరసన తెలియజేయబోతున్నాం అని తెలిపారు. 🌟🔥


Comments


bottom of page