top of page

ప్రధాని రాకతో మారిన లక్షద్వీప్‌ లెక్క.. 20 ఏళ్లలో తొలిసారి..🏝️👀

గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్‌ గురించి ఇంటర్నెట్‌లో ఈ స్థాయిలో సెర్చ్‌ చేయడం తొలిసారి కావడం విశేషం. నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటించిన కొన్ని గంటల తర్వాతే ఇంతటి మార్పు కనిపించడం విశేషం. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ పర్యాటకానికి కొత్త సారిగా రెక్కలొచ్చాయి.

ఏమంటూ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ను సందర్శించారో ఇప్పుడు ఎక్కడ చూసినా లక్షద్వీప్‌ గురించే చర్చ నడుస్తోంది. మోదీ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాల్దీవుల ప్రధాని, మంత్రులు మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో.. మాల్దీవులకు వ్యతిరేకంగా, లక్షద్వీప్‌కు అనూకూలంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లక్షద్వీప్‌లో పర్యటించడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంటర్‌నెట్‌లో కూడా లక్షద్వీప్‌కు భారీగా ఆదరణ పెరుగుతోంది. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్‌ గురించి ఇంటర్నెట్‌లో ఈ స్థాయిలో సెర్చ్‌ చేయడం తొలిసారి కావడం విశేషం. నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటించిన కొన్ని గంటల తర్వాతే ఇంతటి మార్పు కనిపించడం విశేషం. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ పర్యాటకానికి కొత్త సారిగా రెక్కలొచ్చాయి. ఆల్‌ ఇండియా టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ సైతం ఇదే విషయాన్ని చెబుతోంది.

గడిచిన మూడు రోజులుగా లక్షద్వీప్‌కు భారీగా బుకింగ్‌ వస్తున్నాయని తెలిపింది. వచ్చే మూడు నెలల ట్రిప్‌ కోసం మూడురోజుల్లోనే బుకింగ్స్‌ చేసుకున్నారు. ఒక్కసారిగా పెరుగుతోన్న పర్యాటకుల కోసం లక్షద్వీప్ టూరిజం అండ్‌ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొచ్చి నుంచి మాత్రమే నేరుగా లక్షద్వీప్‌కు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెరుగుతోన్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా పలు ప్రాంతాల నుంచి నేరుగా సర్వీసులు తీసుకొస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నరేంద్ర మోదీ పర్యటన తర్వాత సోషల్‌ మీడియాలోనూ అత్యధికంగా సెర్చ్‌ చేసిన పదాల్లో లక్షద్వీప్‌ అగ్రస్థానంలో ఉందని ఆల్‌ ఇండియా టూర్‌ అండ్‌ ట్రావెల్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

లక్షద్వీప్‌ భారత్‌లో ఎలా భాగమైందంటే..

భారతదేశానికి స్వాతంత్ర్యం అనంతరం 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని పలు సంస్థాలను కలుపుకునే క్రమంలో.. పాక్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే లక్షద్వీప్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.

అయితే లక్షద్వీప్‌లో ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో, లక్షద్వీప్‌ని తమ ఆధీనంలోకి తీసుకోవాలిన లియాఖత్‌ అలీ ఖాన్‌ భావించారు. వెంటనే తమ యుద్ధనౌకను అక్కడికి పంపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భారత్‌ కూడా సైన్యంతో లక్షద్వీప్‌ వైపు వెళ్లింది. ఇలా భారత్‌, పాక్‌ సైన్యాలు లక్షద్వీప్‌ వైపు బయలుదేరగా, తొలుత భారత సైన్యం లక్షద్వీప్‌కు చేరుకుని అక్కడ భారత జెండాను ఎగరవేసింది. అనంతరం అక్కడికి చేరుకున్న పాకిస్థాన్‌ సైనికులు.. త్రివర్ణ పతాకాన్ని చూసి వెనుదిరిగారు. ఇలా లక్షద్వీప్‌ భారత్‌లో భాగమైంది.🏝️👀

bottom of page