🌧️🌊🚨 తెలంగాణలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. జంట జలాశయాల్లో గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోంది.
దీంతో పలు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. కాగా.. గురువారం రాత్రి నుంచి మళ్లీ వర్షం మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి కూడా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరించింది. 🌧️🌊🚨
🌧️🌊🚨 ఈ మేరకు వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. 🌧️🌊🚨