top of page
MediaFx

మహేశ్, పవన్ రికార్డులను తిరగరాసిన సినిమా..!


ప్రస్తుతం రీ-రిలీజ్‍ల ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన, క్లాసిక్ చిత్రాలు కొన్ని మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. మంచి కలెక్షన్లను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గిల్లీ’ చిత్రం ఏప్రిల్ 20న థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. 20 ఏళ్ల తర్వాత మరోసారి ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే, రీ-రిలీజ్‍ సినిమాల తొలి రోజు కలెక్షన్ల విషయంలో నేషనల్ వైడ్ రికార్డు ఈ చిత్రం సృష్టించింది. గిల్లీ చిత్రానికి రీ-రిలీజ్ తొలిరోజున భారీ వసూళ్లు వచ్చాయి. ఏకంగా ఈ సినిమా ఫస్ట్ డే సుమారు రూ.10కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రీ-రిలీజ్ చిత్రం ఈ రేంజ్‍లో వసూళ్లను రాబట్టడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. దళపతి విజయ్‍కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి నిరూపించింది. తెలుగు సినిమాలు ఖుషి, బిజినెస్‍మ్యాన్ గతేడాది రీ-రిలీజ్ సమయంలో తొలి రోజు సుమారు రూ.4కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించాయి. దీంతో రీ-రిలీజ్ మూవీ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డు ఆ సినిమాల పేరుతో ఉండేది. అయితే, ఇప్పుడు దళపతి విజయ్ మూవీ గిల్లీ ఆ రికార్డును బద్దలుకొట్టింది. రీ-రిలీజ్ అయిన తొలి రోజే సుమారు రూ.10కోట్లను దక్కించుకుంది. ఇండియాలోనే రీ-రిలీజ్ విషయంలో అత్యధిక ఓపెనింగ్ డే రికార్డును గిల్లీ చిత్రం దక్కించుకుంది.తమిళ మూవీ ‘గిల్లీ’ 2004 ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో దళపతి విజయ్‍కు జోడీగా త్రిష నటించారు. అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఒక్కడు (2003) చిత్రానికి రీమేక్‍గా గిల్లీ రూపొందింది. ఈ చిత్రం అప్పట్లో కూడా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినా దుమ్మురేపుతోంది.

Comments


bottom of page