top of page

జెంటిల్ మెన్ 2.. శంకర్ లేకుండా🌟🎥

శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ జెంటిల్మన్. ఆ సినిమా అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే శంకర్ ని కూడా స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది.

శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ జెంటిల్మన్. ఆ సినిమా అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే శంకర్ ని కూడా స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. జెంటిల్మన్ చిత్రాన్ని నిర్మించిన కె కుంజుమోన్ చాలా ఏళ్ల తర్వాత మరల జెంటిల్మన్ 2 మూవీ ఎనౌన్స్ చేశారు. 1999లో ఆయన నిర్మాతగా చివరి చిత్రం చేశారు. ఆ తరువాత ప్రొడక్షన్ హౌస్ ఆపేసారు.అయితే మరల 24 ఏళ్ళ తర్వాత జెంటిల్మన్ 2 మూవీ చేయనున్నట్లు గతంలో ఎనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ కోసం కథ కూడా ఆయానే రాసుకున్నారు. స్టార్ టెక్నీషియన్స్ తోనే ఈ మూవీ ఉంటుందని కూడా నిర్మాత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా జెంటిల్మన్ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.అయితే ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నది ఎవరు అనే విషయం ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో ఈ చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు.🌟🎥


Komentáře


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page