top of page
Suresh D

ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు.. గంభీర్ బోల్డ్ సొల్యూషన్..?

ఈ సీజన్ ఐపీఎల్లో బౌలర్లు బలవుతున్నారు. బ్యాట్స్‌మెన్ వీర బాదుడు బాదుతుంటే బౌలర్లంతా నిస్సహాయిలుగా మిగిలిపోతున్నారు. 200లకుపై టార్గెట్లను కూడా చేజ్ చేస్తున్న వేళ ఈ బ్యాటర్లకు ఊచకోతకు చెక్ పెట్టి బ్యాలెన్స్ తీసుకురావడానికి కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఓ పరిష్కారం చెబుతున్నాడు. అది ఐపీఎల్లో కూకాబుర్రా బదులు డ్యూక్ బాల్స్ వాడటం.ఐపీఎల్ చరిత్రలో నమోదైన మూడు అత్యధిక స్కోర్లు ఈ సీజన్లో కావడం గమనించాల్సిన విషయం. సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వారాల వ్యవధిలో రెండుసార్లు రికార్డు స్కోర్లు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఏకంగా 224 పరుగులను చేజ్ చేసేసింది. బౌలర్లపై అసలు కనికరం చూపకుండా బాదేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ స్పందించాడు.

180 నాటౌట్ పాడ్‌కాస్ట్ లో అతడు మాట్లాడాడు. ప్రస్తుతం వాడుతున్న కూకాబుర్ర బాల్స్ నుంచి బౌలర్లకు అసలు ఏమాత్రం సహకారం లభించడం లేదని, బాల్ మాన్యుఫ్యాక్చరర్ ను మార్చాలని అతడు అనడం గమనార్హం. ఇన్నింగ్స్ మధ్యలోనే బంతి బాగా పాతబడిపోతోంది. "ఒకవేళ ఓ మాన్యుఫ్యాక్చరర్ 50 ఓవర్లపాటు దృఢంగా ఉండే బంతిని రూపొందించలేనప్పుడు ఆ మాన్యుఫ్యాక్చరర్ ను మార్చాలి. అందులో తప్పేమీ లేదు. కేవలం కూకాబుర్రా బంతులనే వాడాలన్న రూలేమీ లేదు కదా" అని గంభీర్ అన్నాడు.

bottom of page