top of page

మళ్ళీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు. 💰🔥

దేశంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిశాయో లేదో ఇలా గ్యాస్‌ రేట్లు పెరిగిపోయాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో గురువారంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి,

శుక్రవారం, డిసెంబర్‌ 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను పెంచేసాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. పెరిగిన ధర డిసెంబర్‌ 1 నుండి అమల్లోకి వచ్చింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మరో 21 రూపాయలు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. పెరిగిన ధర ప్రకారం శుక్రవారం నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1796 రూపాయల 50 పైసలుగా ఉంది. ముంబైలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 1749 రూపీయఉ, కోల్‌కతాలో 1885 రూపాయల 50 పైసలు, చెన్నైలో 1968 రూపాలయ 50 పైసలుగా ఉంది. హైదరాబాద్‌లో 2024 రూపాయలుగా ఉంది. కాగా గృహవినియోగ సిలిండర్‌ ధర పెంచకపోవడంతో కాస్త ఉపశమనం లభించినట్టే. ప్రస్తుతం ఉన్న డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 💵🌐

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page