top of page
Shiva YT

🌾🏡 వెల్లుల్లి ప్రతి ఇంట లొల్లి.. 🍲🌾

🌾 వెల్లుల్లి లేని ఇంటి వంట బహుశా ఉండదేమో..! ఇలాంటి వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. ధర ఒకేసారి 100% పెరిగి చుక్కలు చూస్తోంది. కొనలేక వంటింటి గృహిణులు మండిపడుతున్నారు. వంటింట్లో అందరూ వాడే వెల్లుల్లి ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఔషధాల తయారీలో కూడా వాడే ఈ వెల్లుల్లి సాగు ఈ సంవత్సరం వర్షాభావం కారణంగా దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో సప్లై తగ్గి డిమాండ్ పెరిగి వినియోగదారులకు భారంగా మారింది. రిటైల్ మార్కెట్లో కిలో 500 రూపాయలు పెరిగింది.

🌾 వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లోకి సరఫరా తగ్గిపోయింది. దీంతో ఇటీవల కొన్ని రోజుల్లోనే ధర అమాంతం పెరిగిపోయింది. రిటైల్ మార్కెట్లో కిలో నాణ్యతను బట్టి రూ. 350 నుంచి 500 రూపాయలకు చేరుకుంది. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ లో హోల్సేల్ మార్కెట్ లోనే రూ. 350 నుంచి 400 రూపాయలు పలుకుతోంది. నాణ్యమైన వెల్లుల్లి దర రూ. 500 దాటింది. ఉత్తరాదిన అనూహ్య వర్షాల వల్ల, దక్షిణాదిన వర్షాభావం వల్ల వెల్లుల్లి దిగుబడి దెబ్బతినిందని వ్యాపారులు అంటున్నారు. చాలా ప్రాంతాల్లో తుఫాను కూడా వెల్లుల్లి పంటను నష్టపరిచింది. దీనివల్ల మార్కెట్లోకి వెల్లుల్లి సప్లై తగ్గి ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం చలికాలంలో వెల్లుల్లి ధరలు పెరుగుతాయి. కొత్త పంట మార్కెట్లోకి వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 🌾🌐🛒

Comments


bottom of page