top of page
MediaFx

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రివ్యూ.. విశ్వక్ మరో హిట్ కొట్టాడా?


గత కొన్ని రోజులుగా సరైన సినిమాలు లేక థియేటర్లు కళ తప్పాయి. ముఖ్యంగా దేవర, కల్కి లాంటి చిత్రాలు వాయిదా పడటం చిన్న సినిమాలు కూడా ఆకట్టుకోకపోవడంతో సమ్మర్ మొత్తం సప్పగా సాగింది. అయితే ఈరోజు ఏకంగా మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా ఒకటి. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లు గా నటించి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ గెస్టుగా వెళ్లడంతో సినిమాపై ఆడియన్స్ దృష్టి బాగానే పడింది. మరి ఇటీవల గామితో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఈ చిత్రంతో మరో విజయం అందుకున్నాడా? సినిమా  ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. సినిమా కథ కొత్తగా లేకపోయినా టేకింగ్ బాగుంది  . ముఖ్యంగా సినిమాను ఫాస్ట్ ట్రాక్‌లో, రేసీ స్క్రీన్‌ప్లేతో తీసుకెళ్లారు. అసలు ఎక్కడా చిన్న ల్యాగ్ కూడా లేదు రా అండ్ రస్టిక్‌గా సినిమా ఉంది , మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి. సినిమా ఎక్కడా బోర్ కొట్టనప్పటికీ డైరెక్షన్ కాస్త ఔట్ డేటెడ్‌గా ఉంది . కానీ లంకల రత్న పాత్రలో విశ్వక్ నటన మాత్రం అదిరిపోయింది . ఇక నేహా శెట్టి అందాలు సినిమాకి మరో ప్లస్ అని చెప్పాలి . ఇక అంజలి చేసిన రత్నమాల పాత్ర కూడా బానే ఉంది . ఇప్పటివరకూ అంజలి ఇలాంటి మాస్ పాత్ర ఎప్పుడూ చేయలేదు . మొత్తానికి  అయితే  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో విశ్వక్ సేన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కలి సమయంలో చూసేయండి

bottom of page