top of page

🇬🇧 ఢిల్లీ వేదికగా తీవ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్..🇬🇧

ఖలిస్తాన్ అంశంపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక ప్రకటన చేశారు. 🌍 జీ 20 సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన సునక్.. 🤝

యూకే ఎలాంటి తీవ్రవాదం, హింసను అంగీకరించదని స్పష్టం చేశారు. ANIతో మాట్లాడుతూ, ఖలిస్తాన్ సమస్యపై తాము భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. 🇮🇳🤝🇬🇧

బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి భారతదేశానికి వచ్చిన సునాక్.. తీవ్రవాదం అంశంపై సీరియస్‌గా స్పందించారు. 🌟 ‘బ్రిటన్‌లో ఎలాంటి తీవ్రవాదం, హింస జరిగినా సహించేది లేదు. ఈ తరహా తీవ్రవాదాన్ని రూపుమాపుతాం. దీన్ని అస్సలు తట్టుకోలేను.’ అని స్పష్టం చేశారు. 🚫 ఇక అంతకు ముందు బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చిన సునాక్‌కు పాలెం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ✈️ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు జై సియారామ్‌తో కలిసి స్వాగతం పలికారు. 🤗

‘జి 20 భారత్‌కు పెద్ద విజయం. దీనికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన సమయంలో భారతదేశం సరైన దేశం. కొన్ని రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను’ అని రుషి సునాక్ అన్నారు. 🌍 ‘వసుధైవ కుటుంబం’ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది గొప్ప అంశమని అన్నారు. 🤝 అలాగే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, FTA సహా అనేక ఇతర అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. 🤝🇷🇺🇺🇦

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page