top of page
Shiva YT

🍅📉మరింత పతనమైన టమాటా ధర..

📆🛒వారం క్రితం టమాట కొనాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. కిలో టమాట ధర ఏకంగా రూ.250 నుంచి రూ.300 వరకు పలికింది. 15 రోజులకు ముందు దేశంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.

🇹🇬ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలికింది. గత నెలలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా గత వారం రోజులుగా టమాటా దిగుబడి పెరిగింది. దీంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లోని రైతు బజార్‌లలో కిలో టమాటా గత సోమవారం రూ.63 నుంచి రూ.70 పలికింది.

🌱ఇక ఏపీలోని రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా దిగుబడి అవుతోంది. తెలంగాణలోనూ టమాటా దిగుబడి పెరిగింది. అంతేకాకుండా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా టమాటా అధికంగా రవాణా కావడంతో హైదరాబాద్‌లోని వివిధ రైతు బజార్లలో శుక్రవారం మొదటి రకం టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది. 🍅🔽రెండో రకం టమాటా కిలో రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది. ఇదే మాదిరి నిన్న గురువారం కూడా టమాటా ధర భారీగా పతనమైంది. మేలి రకం టమాటా కిలో రూ. 50 నుంచి రూ.64 వరకు ధర పలకగా.. రెండో రకం టమాటా కిలో రూ.36 నుంచి రూ.48 వరకు పలికింది.🔽🛒🍅


bottom of page