మరో చిన్న సినిమాగా 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ చైతన్యరావు జోడీగా లావణ్య లక్ష్మి హైలైట్ గా అనిపిస్తున్న ఫొటోగ్రఫీ.
ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథలకు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందువలన అలాంటి నేపథ్యంతో కూడిన కథలను తెరపై చూపించడానికి మేకర్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి ఒక కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'అన్నపూర్ణ ఫొటో స్టూడియో' రానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'భూమికి అందం ఊరు .. ఊరుకు అందం పైరు .. కొండల్లో దూకే సెలయేరు' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రిన్స్ హ్యారీ కట్టిన బాణీ బాగుంది. శ్రీనివాస మౌళి సాహిత్యం .. సాయిచరణ్ ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. పాటపై కట్ చేసిన పల్లె విజువల్స్ మనసుకు పట్టేలా ఉన్నాయి. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్యరావు - లావణ్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ అనే విషయం టైటిల్ ను బట్టి చూస్తేనే అర్థమవుతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.