top of page

ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు!

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి మరోసారి గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. యూఐడీఏఐ ప్రకారం.. యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ చేసేందుకు సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. (myAadhaar) పోర్టల్‌లో ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అప్‌డేట్‌లకు మాత్రమ రూ. 50 రుసుము వర్తిస్తుంది.

ఆధార్ కార్డ్ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలంటే? :

  1. myAadhaar పోర్టల్‌లో లాగిన్ చేయండి:

  • మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ని ఉపయోగించి myAadhaar పోర్టల్కి లాగిన్ చేయండి.

  • క్యాప్చా ఎంటర్ చేసి, ‘Login using OTP’పై క్లిక్ చేయండి.

  • మీ లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో అందుకున్న ఓటీపీ కోడ్‌ని ఎంటర్ చేయండి.

  1. పోర్టల్‌ను యాక్సెస్ చేయండి:

  • ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ ఎంచుకోండి.

  • నివాసి ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

  1. అవసరమైన ప్రూఫ్‌లను అప్‌లోడ్ చేయండి:

  • ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్స్ ఎంచుకుని అవసరమైన ప్రూఫ్ అప్‌లోడ్ చేయండి.

  1. అభ్యర్థనను సమర్పించండి:

  • ‘Submit’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • అప్‌డేట్ అభ్యర్థన 14-అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు.

సెప్టెంబర్ 14కి ముందు మీ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి!

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page