top of page
Suresh D

ఆరు నెలల తరువాత భూమి మీదకు...🌍

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఆరు నెలలకపైగా గడిపిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

భూ కక్ష్యలోని ఐఎస్ఎస్ నుంచి మంగళవారం తెల్లవారుజామున స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు ల్యాండయ్యారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న నేవీ, నాసా సిబ్బంది ఈ క్యాప్సుల్‌ను బయటకు తీసి, సురక్షితంగా నౌకపైకి చేర్చారు. అనంతరం అందులోని వ్యోమగాములు.. అమెరికాకు చెందిన జాస్మిన్‌ మాగ్‌బెలి, డెన్మార్క్‌కు చెందిన ఆండ్రియాస్‌ మోగెన్‌సెన్‌, జపాన్‌కు చెందిన సతోషి ఫురుకవా, రష్యాకు చెందిన కాన్‌స్తాంటిన్‌ బొరిసోవ్‌ వెలుపలికి వచ్చారు.  ఈ నలుగురు స్పేస్‌ఎక్స్ మిషన్‌లో భాగంగా గతేడాది ఆగస్టు 26న ఫాల్కన్‌ 9 రాకెట్‌లో రోదసిలోకి వెళ్లారు. మెరైన్ హెలికాప్టర్ పైలట్ అయిన నాసా వ్యోమగామి జాస్మిన్ మాగ్‌బెలి.. ఐఎస్ఎస్ నుంచి తిరిగొచ్చే మెషిన్‌ను నాయకత్వం వహించారు. మేము మీకు కొంత పీనట్ బటర్, కొద్దిగా రొట్టేలు మాత్రమే ఉంచాం’ అని సోమవారం భూ కక్ష్యలోని ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన తర్వాత మాగ్‌బెలీ రేడియోలో ప్రకటించారు. దీనికి నాసా శాస్త్రవేత్త లోర్ ఓ హారా బదులిస్తూ.. ‘నేను ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతున్నాను.. చాలా ఉదారమైన బహుమతికి ధన్యవాదాలు.’ అని తెలిపారు.🌍🚀

bottom of page