top of page
MediaFx

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జైలుకు సిద్ధం


ఆర్థిక రికార్డుల తారుమారు కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలారు. స్థానిక మీడియాతో మాట్లాడిన ట్రంప్ తాను జైలుకు వెళ్ళేందుకు సిద్ధమని చెప్పారు. ట్రంప్ పై 34 కేసుల్లో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. "నేను జైలుకు వెళ్ళేందుకు సిద్ధం. ఒక అధ్యక్షుడిని జైలుకు పంపడం ఏంటని నా లాయర్లు టీవీల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం లేదని నేను వారితో చెప్పాను. ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది" అని ట్రంప్ అన్నారు. అయితే, తాను జైలుకు వెళ్ళడాన్ని ప్రజలు తట్టుకోలేరని హెచ్చరించారు.ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా శృంగార తార స్టార్మీ డేనియల్స్ కు 1.30 లక్షల డాలర్ల హష్ మనీ డబ్బు ఇచ్చారని, ఇందు కోసం రికార్డులను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో మే 31న జ్యూరీ 12 మంది సభ్యులతో ట్రంప్ ను దోషిగా తేల్చింది. జులై 11న ట్రంప్ కు శిక్ష ఖరారు కానుంది.

bottom of page