top of page

వైసీపీ ఓడిపోతే ఎందుకు సిగ్గుపడాల..?రోజా


ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఊహించని విధంగా భారీ పరాజయాన్ని చవిచూసింది. అసెంబ్లీలో 151 సీట్లతో ఉన్న వైసీపీ, తాజా ఎన్నికల్లో 140 సీట్లు కోల్పోయి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రోజుకో విశ్లేషణ చేస్తున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు.

వైసీపీ ఘోర పరాజయంపై స్పందిస్తూ రోజా, "ఎందుకు సిగ్గుపడాలి?" అని ప్రశ్నించారు. చెడు చేసి ఓడితే సిగ్గుపడాలన్నారు, కానీ మంచి చేసి ఓడితే ఎందుకు సిగ్గుపడాలని అన్నారు. కాబట్టి గౌరవంగా తలెత్తుకుని తిరగాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఏం చేయాలో ఆమె సూచించారు.

నగరిలో రోజా ఓటమిని కూడా పలువురు ఊహించారు. ఎన్నో సర్వేలు ఆమె ఓటమి తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ఫలితాలకే వేచి ఉండకుండా రోజా ఈసారి ఎన్నికల్ని లైట్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఫలితాల తర్వాత ఆమె ప్రత్యర్థి కేజే శాంతి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ రోజా మాత్రం ఇవాళ స్పందించారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page