top of page
MediaFx

హిందువులకు భగవద్గీత.. పవన్ ఫ్యాన్స్‌కి ‘గబ్బర్ సింగ్’ : బండ్ల గ‌ణేష్


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రాల‌లో గ‌బ్బ‌ర్ సింగ్ ఒక‌టి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో వచ్చిన ఈ చిత్రం 2012లో విడుదలై పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. స‌ల్మాన్ ఖాన్ ద‌బాంగ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాగా ద‌ర్శ‌కుడు హరీశ్ శంక‌ర్ త‌నదైన శైలిలో తెర‌కెక్కించాడు. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వాగ్‌నే ప్రేక్ష‌కులు ఇప్పటికి మార్చిపోలేరు అంటే ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఈ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మ‌ళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ‘గబ్బర్ సింగ్‌’ (Gabbar Singh Re-Release) రీరిలీజ్‌ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించ‌గా నిర్మాత బండ్ల గ‌ణేష్ మాట్లాడాడు.. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా విష‌యానికి వ‌స్తే.. నా తల్లి తండ్రులు నాకు జన్మనిస్తే పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చాడు. ఆయ‌న గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. నేను ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నా కానీ.. ప‌వ‌న్ లేక‌పోతే నాకు ఈ పేరు కానీ ఈ హోదా కానీ ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ లేకపోతే నేను చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ మిగిలిపోయేవాడిని. పవన్ కళ్యాణ్ ఒకరోజు నన్ను పిలిచి గ‌ణేష్ నువ్వు నిర్మాత‌గా చెస్తావా అని అడిగాడు. అంద‌రూ నువ్వు నిర్మాత ఏంట‌య్యా అంటుంటే ప‌వ‌న్ నాకు అండ‌గా నిలిచాడు. గ‌బ్బ‌ర్ సింగ్ ఒక చరిత్ర.హిందువులకు భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమో పవన్ ఫ్యాన్స్ కి కూడా గబ్బర్ సింగ్ అంతా పవిత్రమైనది అది ఎప్ప‌టికి మారదు. ఈ సినిమా క్రెడిట్‌కు సంబంధించి.. సినిమాలోని ప్ర‌తి అడుగు, ప్ర‌తి మాటా, ప్ర‌తి క‌ష్టం అంతా హ‌రీశ్ శంక‌ర్‌కే ద‌క్కుతుంది. ప‌వ‌న్‌తో ఇంత‌కుముందు తీన్మార్ సినిమా చేశాను. ఆయ‌న ద‌ర్శ‌కుడు ఏం చేబితే అదే చేస్తాడు. కానీ హ‌రీశ్ శంక‌ర్ అలా కాదు. హరీష్ శంకర్ ని సరిగ్గా వాడుకోవట్లేదు అని పవన్ హరీష్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నటించారు. పవన్ కళ్యాణ్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ హ్యాపీగా బతకగలిగినా అవన్నీ వదిలేసి పదేళ్లు పోరాడి పోరాడి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలు, ద‌ర్శ‌కులు, నిర్మాతలు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నేను ఏడేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నాను. మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మళ్ళీ సినిమాలు తీస్తాను. పరమేశ్వర ఆర్ట్స్ అంటే మళ్ళీ సూపర్ హిట్ సినిమాలు తీసేలా చేస్తాను. అంటూ బండ్ల గ‌ణేష్ చెప్పుకోచ్చాడు.




bottom of page