top of page

పరీక్షల వేళ ఈ యోగాసనాలు చేయండి.. జ్ఞాపకశక్తి పెంచుకోండి..

శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలో మానసికంగా కూడా అంతే ఆర్యోగంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం కోసం యోగాసనాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో ఎలాంటి యోగసనాలు పాటించడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పరీక్షల సమయం దగ్గరపడుతోంది. ఏడాదంతా కష్టపడి చదివినా, చివరికి పరీక్షల సమయానికి మానసికంగా ఆరోగ్యంగానే ఉంటేనే మంచి ఫలితం పొందొచ్చు, పరీక్షల్లో మంచి ప్రతిభను కనబర్చొచ్చు. ఇందుకోసం శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలో మానసికంగా కూడా అంతే ఆర్యోగంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం కోసం యోగాసనాలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో ఎలాంటి యోగసనాలు పాటించడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* మెదడుకు రక్త ప్రసరణ అందించడంలో శీర్షాసనం ఎంతగానో ఉపయోగుడుతుంది. మెదడుకు రక్త ప్రసరణను పెంచడంతో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఈ ఆసనం సహాయపడుతుంది. నేలపై తల పెట్టి కాళ్లను పైకి లేపడమే ఈ ఆసనం.

* బకాసనం కూడా పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ ఆసనం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలు కలిసి పనిచేయడానికి సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆసనం ద్వారా మణికట్టు, చేతులు, పైభాగం, భుజాలు బలపడడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

* ఇక మెదడును పదును పెట్టడంలో పశ్చిమోత్తనాసనం ఉపయోగపడుతుంది. ఈ యోగాసనం చేయడం వల్ల మెదడులో రక్త ప్రసరణ మెరుగవుతుంది. మెదడుకు పదును పెట్టడంతో పాటు తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.

* పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతంత లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడికి చెక్‌ పెట్టొచ్చు.

* విద్యార్థులు పరీక్షల సమయంలో హలాసనం చేయడం ద్వారా మెదడుకు సమతుల్య రక్త ప్రసరణ అందుతుంది. అలాగే నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీంతో మెదడు పనితీరు మెరుగవుతుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page