top of page

పది నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ మీ చేతుల్లోకి..


ఇటీవల విడుదలైన పలు నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా స్పీడ్ డెలివరీ సిస్టమ్ ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ హోమ్ బ్రాంచ్ ఉన్న బెంగూళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సిస్టమ్ అమల్లోకి వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఎంపిక చేసిన వినియోగదారులకు ఈ సేవ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ మినిట్స్ యాప్ ద్వారా గ్రాసరీ వస్తువులతో పాటు ఐ ఫోన్ 15 లేదా సోనీ ప్లే స్టేషన్ కన్సోల్ వంటి హై-ఎండ్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ యాప్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ వివిధ ఆఫర్లను అందించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బెల్లందూర్, హెచ్‌ఎస్‌ఆర్ వంటి బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులకే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్ ద్వారా స్పీడ్ డెలివరీ అందుబాటులో ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్డర్‌ను కేవలం 16 నిమిషాల్లోపు కస్టమర్ ఇంటికి చేర్చేలా ఫ్లిప్ కార్ట్ చర్యలను తీసుకుంటుంది. అయితే  రూ. 99 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఉచిత డెలివరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు వివిధ యాప్స్‌కు గట్టి పోటీనిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆర్డర్ మన ఇంటికి వచ్చాక రిజెక్ట్ చేసే అవకాశం కూడా వినియోగదారులను అందుబాటులో ఉంటుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ యాప్ ఆర్డర్‌పై రూ.5 వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలుద చేస్తుంది. 

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page