పండగల సీజన్ సమీపిస్తున్న వేళ 🎉 ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఏటా నిర్వహించే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక సేల్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ సేల్లో ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్ సహా వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది. ఈ క్రమంలో ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ప్రత్యేక సేల్ బిగ్ బిలియన్ డేస్ తేదీలను ప్రకటించింది. ఈసారి అక్టోబర్ 08 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ సేల్ నిర్వహించనున్నారు.
ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, పిక్సెల్ 7ఏ సహా వివిధ ఎలక్ట్రానిక్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలపై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ప్రత్యేకంగా ప్రారంభించిన టీజర్ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్‌బిగ్ బిలియన్ డేస్‌ఏయే ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయో ప్రకటించింది. ఇందులో ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, పిక్సెల్ 7ఏ, పోకో ఎక్స్5 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, రెడ్‌మీ నోట్ 12 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఏ34, పోకో ఎఫ్5, శాంసంగ్ గెలాక్సీ ఏ23, ఒప్పో రెనో 10, మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా జీ54, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయ తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. మోటోపై సెప్టెంబర్ 28న, వివోపై సెప్టెంబర్ 29న, ఇన్ఫీనిక్స్‌పై సెప్టెంబర్ 30న, రియల్‌మీపై అక్టోబర్ 02న, శాంసంగ్‌పై 3న, పోకోపై 4న, గూగుల్ పిక్సెల్‌పై అక్టోబర్ 05న, రెడ్‌మీ ఫోన్లపై అక్టోబర్ 05న ఆఫర్లను ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 50-80% వరకు ఆఫర్లు ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వెల్లడించింది. పాదరక్షలు, సంప్రదాయ దుస్తులు, ఆభరణాల వంటి ఫ్యాషన్ ఉత్పత్తులపై 90 శాతం వరకు ఆఫర్లు ఉన్నట్లు వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. బ్యూటీ ప్రోడక్ట్స్‌పైన 60- 80శాతం వరకు రాయితీ లభించనున్నట్లు పేర్కొంది. హోమ్‌డెకర్ విభాగంలో 80 శాతం, ఫర్నీచర్‌పై 85శాతం వరకు తగ్గింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రిఫ్రిజిరేటర్లపై 70శాతం, 4కే స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు రాయితీ ఉండొచ్చని పేర్కొంది. వాషింగ్ మెషీన్లు రూ.5,000 నుంచే లభించనున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేవారికి ఆయా ఉత్పత్తులపై తగ్గింపు కూడా ఉంటుందని పేర్కొంది. 🛍️💰