top of page

క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డు బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..🏏🏆

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రికార్డు బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో చేసిన పరుగులతో కలిపి కోహ్లీ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు.

టీమిండియా స్టార్ ప్లేయర్, రన్ మెషీన్, రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీ.. మరో రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్సులో 38 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 76 పరుగులు చేశాడు కోహ్లీ.విరాట్ కోహ్లీ.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు వేల పైచిలుకు స్కోరు సాధించాడు. ఈ ఏడాది మొత్తంగా 2048 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఇలా కోహ్లీ ఆరు సార్లు ఓ క్యాలెండర్ ఇయర్‌లో 2000 పైచిలుకు పరుగులు చేశాడు. దీంతో ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 7 వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000 పైచిలుకు పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు.తొలిసారిగా 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పైచిలుకు స్కోరు చేశాడు. ఆ తర్వాత 2014, 2016, 2017, 2019, 2023 సంవత్సరాల్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.🏏🏆

Комментарии


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page