top of page
MediaFx

అంతరిక్షంలోకి తొలి తెలుగు వ్యక్తి ..


జెఫ్ బెజోస్కు చెందిన 'బ్లూ ఆరిజిన్' సంస్థ చేపట్టిన స్పేస్ మిషన్ విజయవంతమైంది. తెలుగు వ్యక్తి గోపిచంద్ తోటకూర సహా ఆరుగురు స్పేస్ లోకి వెళ్లారు. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్ఎస్-25 మిషన్ ను పశ్చిమ టెక్సాస్లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గంటలకు రాకెట్ బయల్దేరింది. ఈ క్రమంలోనే అంతరిక్షంలో చేరుకున్న వారంతా కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత క్యాప్సూల్స్ లో భూమిని చేరుకున్నారు. దీంతో స్పేస్ లోకి వెళ్లిన తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ చరిత్ర సృష్టించారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వెన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ లో కెప్టెన్గా పనిచేసిన ఎడ్ డ్వెట్.. 1961లో స్పేస్ లోకి వెళ్లేందుకు ఛాన్స్ వచ్చినప్పటికీ.. వెళ్లలేకపోయారు. ఎట్టకేలకు 90 ఏళ్ల వయసులో ఆయన కల నెరవేరింది. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన అత్యంత పెద్ద వయస్కుడు ఆయనే.భారత తొలి స్పేస్ టూరిస్ట్ కూడా గోపిచందే కావడం గమనార్హం. బ్లూ ఆరిజిన్ సంస్థ మానవసహిత అంతరిక్ష ప్రయోగం చేపట్టడం 2022 తర్వాత ఇదే మొదటిసారి. మొత్తంగా ఇది ఏడోసారి. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీలోకి వెళ్లివచ్చారు.

bottom of page