🏭 అమృత్‌సర్ జిల్లా అగ్నిమాపక అధికారి దిల్‌బాగ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 3:30 గంటలకు మంటలు చెలరేగాయి. 🔥
డ్రమ్ముల్లో మద్యం నిల్వ ఉండడంతో ఫ్యాక్టరీ లోపల పేలుళ్లు సంభవించాయి. దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు 4 గంటల సమయం పట్టింది. 🔥 ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. 😓 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించగా.. మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. 🔍 అగ్నిప్రమాదానికి గల కారణాలను, దాని వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి పోలీసు బృందాలు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాయని పోలీసు అధికారి తెలిపారు. 🔍
🏭 అమృత్‌సర్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, నలుగురు మృతి, పలువురు గల్లంతయ్యారు. 🔥 అమృత్‌సర్‌లోని మజితా రోడ్‌లోని ఓ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఒక మహిళతో సహా కనీసం నలుగురు మరణించారు. 🔥🚒