top of page
MediaFx

ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఇప్పుడు చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అనారోగ్య సమస్యలు పెరగడంతో.. ఫిట్‌గా ఉండేందుకు తెగ ప్రయాస పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయాన్నే వ్యాయామం చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అందులోనూ ఎక్కువగా చాలా మంది వాకింగ్, రన్నింగ్ చేస్తూ ఉంటారు.చాలా మంది ఉదయం ఏమీ తినకుండా వాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. మరి పరగడుపు వాకింగ్ చేస్తే.. మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేచిన వెంటనే ఏమీ తినకుండా వాకింగ్ చేయడం వల్ల.. మెటబాలిజం పెరుగుతుంది. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. పరగడుపునే వాకింగ్ చేయడం చాలా మంచిది. ఖాళీ కడుపుతో మార్నింగ్ వాకింగ్ చేస్తే.. రోజంగా యాక్టీవ్‌గా ఉంటారు. రాత్రి పూట ఎలాంటి డిస్టెబెన్స్ లేకుండా నిద్ర పడుతుంది. నిద్ర లేమి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లడం మంచిది. అదే విధంగా ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే.. మీరు బరువు కూడా తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరిగి.. మీ బాడీ ఫిట్‌గా మారుతుంది. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వులు అనేవి కరుగుతాయి.

Comments


bottom of page