ఐ బొమ్మ పై చాల మంది సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. మొన్నామధ్య ఐ బొమ్మ టీమ్ ఛాలెంజ్ చేసి మరి థియేటర్స్ లో రిలీజ్ అయిన ఓ సినిమాను పైరసీ చేసి తమ సైట్ లో పెట్టేశారు. 🎥📤
అలాగే పెద్ద వార్నింగ్ నోట్ కూడా ఇచ్చారు. ఇటీవల ఓ దర్శకుడు కూడా ఐ బొమ్మ పై మండిపడ్డారు. కృష్ణా రామా అనే సినిమా కు రాజ్ ముదిరాజు అనే దర్శకుడు డైరెక్ట్ చేశాడు. దాన్ని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే దాన్ని ఐ బొమ్మ సైట్ లో పెట్టేశారు. దాంతో దర్శకుడు స్పందిస్తూ.. అయ్యా ఐ బొమ్మా.. మా సినిమా లో పెద్ద హీరోలు లేరు. రెమ్యునరేషన్ తీసుకునే ఇద్దరు నటులు మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. రోజుకూలీకి పని చేసేవాళ్లే నా సినిమాలో ఉన్నారు. మల్టీ నేషనల్ కంపెనీ ల ఎగ్జిక్యూటివ్స్ తో పోల్చి చూస్తే వాళ్ల సంపాదన చాలా తక్కువ . మా సినిమా థియేటర్స్ లో కూడా వదల్లేదు డైరెక్ట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేశాం అన్నారు. మీ వెబ్ సైట్ లో కనిపిస్తున్న సినిమాలన్నీ చిన్న సినిమాలే.. నీతి కోసం, పేదవాళ్ల కోసం నిలబడుతున్నట్టు ఫోజులు కొట్టే మీకు ఎందుకింత హిపోక్రసీ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఒక సినిమా తీస్తే మీకు ఆ బాధ తెలుస్తుంది అని అన్నారు రాజ్ ముదిరాజ్. ఆయన ఈ కామెంట్స్ చేసి చాలా రోజులే అవుతున్నా మారోసారి ఇది వైరల్ అవుతుంది. చాలా మంది రాజ్ ముదిరాజ్ మాటల్లో న్యాయం ఉందని అంటున్నారు. ఇలాంటి సైట్స్ వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి అని కామెంట్ చేస్తున్నారు చాలా మంది. 🎬🗣️