🎥 అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉన్న కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. 💬 తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసి అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు.
🎥 అరెస్టు భయంతో అజ్ఞాతంలో ఉన్న కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. 💬 తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసి అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. 📜 ‘ప్రజాకీయ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన ఉపేంద్ర ఆరేళ్లు అయిన సందర్భంగా ఇటీవల ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడారు. 👥 ఊరన్న తర్వాత మంచి, చెడు కూడా ఉంటాయని, మంచికే పెద్దపీట వేసి చెడును తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 🌾 ఈ సందర్భంగా ఓ కన్నడ సామెతను ఉటంకించారు.🗣️ఆ సామెత “ఉరన్నాక దళితులు ఉంటారు వాళ్ళను పట్టించుకోకండి” అన్న అర్థంలో ఉండటం వల్ల వివాదానికి కారణమైంది. దళిత సంఘాల నేతలు ఆయనపై కేసులు పెట్టారు. 📄 దీంతో అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 👮 చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపించారు. 📋