top of page

చెల్లెలుతో సమరం…నెగ్గేదెవరో..? తగ్గేదెవరో..?

2019 ఎన్నికలకు ముందు పులివెందులలో జరిగిన వివేక హత్య….ఆనాటి ప్రతిపక్ష పార్టీకి ఒక్క ఛాన్స్ అవకాశం తెచ్చిపెట్టింది. మేము ప్రతి పక్షంలో ఉన్నాం హత్యకు కారణం అధికార పక్షమే అంటూ సొంత మీడియాలో కథనాలు ప్రచురించడం, ఇదే అంశం పై జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగించడంతో అసలు ఎం జరిగింది..ఎం జరుగుతుంది అని తెలుసుకునే లోపే టీడీపీ పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలాగే జగన్ అధికారంలోకి వచ్చాక వివేక కుటుంబానికి జరగాల్సిన అవమానం జరిగిపోయింది. ఆరు పదుల వయస్సులో వివేకాకు రెండో భార్య అంటూ ఒక కథనం, ఆయన హత్యకు ఆస్తి తగాదాలే కారణం అంటూ మరో కథనం, వివేక హత్యలో సొంత కుటుంబ సభ్యుల ప్రమేయమే అంటూ మరో కథనం సాక్ష్యాలు లేకుండా సాక్షిలో పురుడుపోసుకున్నాయి. ఈ అవమానాలతో అసలు తనతండ్రి చావుతో వైసీపీ చేస్తున్న రాజకీయం ఏంటో అప్పుడు గ్రహించగలిగారు సునీతా. తండ్రి చావుకు న్యాయం కోసం పోరాటం ఒక పక్క, సొంతం అనుకున్న వారే నీచంగా చిత్రీకరించే కథనాలను తిప్పికొడుతూ మరోపక్క వైసీపీ ప్రభుత్వం పై ఒంటరి పోరు సాగిస్తున్న వివేక కుమార్తె సునీతకు అండగా నిలిచారు వైస్ జగన్ సోదరి వైస్ షర్మిల. బాబాయ్ హత్య వెనుక ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి పై, ఆయనను అండగా ఉంటున్న జగన్, భారతి ల పై విమర్శలు చేస్తూ వివేక హత్యకు న్యాయం కావాలి అంటూ సునీతకు తోడుగా తన గళం విప్పారు షర్మిల. అయితే ఇటువంటి వారిని కట్టడి చేయాలి అంటే రాజకీయ బలంగా కూడా అవసరమే అని భావించిన సునీతా కు ఇప్పుడు షర్మిల రూపంలో ఆ బలం దొరకబోతుంది. కాంగ్రెస్ పార్టీ తరుపున కడప ఎంపీ గా బరిలో దిగనున్నారు షర్మిల. ఇక్కడ వైసీపీ కడప అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే వైస్ కుటుంబం నుంచే అన్నా చెల్లెళ్లు గా ఉన్న షర్మిల – అవినాష్ పోరుకి కడప పార్లమెంట్ స్థానం వేదిక కానుంది. ఇక్కడ నెగ్గేదెవరో..?తగ్గేదెవరో..? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిని ఊరిస్తుంది. ఈ ప్రజా తీర్పుతో వివేక హత్యకు న్యాయం జరగుతుంది అనే ఆశతో వివేక కుమార్తె సునీతా కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హత్య రాజకీయాలు చేస్తున్న, ప్రోత్సహిస్తున్న వైసీపీ పార్టీకి ఎవ్వరు ఓటు వేయొద్దు అంటూ ఏపీ ప్రజానీకాన్ని అభ్యర్దించిన సునీతా ఇప్పుడు అవినాష్ కు వ్యతిరేకంగా పోటీ చేయబోతున్న షర్మిలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. కుంటి సాకులు చెప్పి విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న అవినాష్ రెడ్డి పై ఇప్పటికే ప్రజలలో చాల అనుమానాలే మొదలయ్యాయి. దీనికి తోడు వివేక హత్య నేపథ్యంలో తెరకెక్కిన వివేకం మూవీ కూడా ఈ అనుమానాలను ప్రజలలో బలపరుస్తుంది. అవినాష్ కు మద్దతుగా జగన్ నిలబడితే షర్మిలకు అండగా వివేక కుటుంబం నిలవబోతుంది. గత ఎన్నికలలో అంతా ఒక్కటిగా జగన్ వైపు నిలబడగా ఈ ఐదేళ్లలో అంతా తారుమారవయ్యింది. ఒంటరి జగన్ ఒక్కటిగా వైస్ వివేక కుటుంబం షర్మిల వైపు నిలబడనున్నారు.

bottom of page