🛂🆔 కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులు ఎటువంటి హామీ లేకుండా వ్యవసాయ సంబంధిత పనులను పూర్తి చేయడానికి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఇది స్వల్పకాలిక రుణం. దీనికి మీరు ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టనవసరం లేదు. దీని వల్ల రైతులకు వ్యవసాయానికి డబ్బు కొరత రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చనేది ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక ప్రభుత్వ లక్ష్యం.
❓📄 పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? 🌐🖋️ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రైతులు ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోండి. ఆ తర్వాత ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపి సమర్పించండి. అయితే ఆఫ్‌లైన్ దరఖాస్తు కోసం మీరు మీ సమీప బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ను సమర్పించండి.
📋📄 ఏ పత్రాలు అవసరం: ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఓటరు గుర్తింపు కార్డు వాహనం లైసెన్స్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో