top of page
Shiva YT

రైతు బంధు డబ్బులు..మీ అకౌంట్ లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

రైతు బంధు నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో క్రెడిట్ చేయడం మొదలుపెట్టింది. అయితే రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.


జూన్ 26 నుంచి రైతు బంధు నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లలో క్రెడిట్ చేయడం మొదలుపెట్టింది. అయితే రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

రైతు బంధు పథకం తొలినాళ్లలో ప్రభుత్వం చెక్కులను పంపిణీ చేసింది. ఈ చెక్కులను అందుకున్న రైతులు బ్యాంకులకు వెళ్లి క్యాష్ తీసుకునేవారు. ఇలా ప్రతి మండలంలో చెక్కులు పంపిణీ కేంద్రం గురించిన వివరాలను ప్రభుత్వం రైతు బంధు వెబ్‌సైట్‌లో పొందు పర్చేది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను రైతులు సందర్శించాలి.అనంతరం హోం పేజీలో ఉన్న ‘చెక్ డిస్ట్రిబ్యూషన్ వెన్యూ షెడ్యూల్’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం, రైతులు అక్కడ కనిపించే డ్రాప్ డౌన్ లిస్టులో తమ జిల్లాను ఎంచుకోవాలి. ఆ తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ మండలంలో చెక్కుల పంపిణీ ఎక్కడ జరుగుతుందనే వివరాలు కనిపిస్తాయి.* బ్యాంకు సేవలు : చెక్కుల పంపిణీతో రైతులు భారీగా క్యూ కట్టాల్సి వచ్చేది. గంటల తరబడి బారులు తీరేవారు. దీంతో ఈ సమస్యకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకుల్లో నిధులను నేరుగా డిపాజిట్ చేస్తోంది.రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లొచ్చు. అక్కడ అకౌంట్ పాస్‌బుక్ ఇస్తే సంబంధిత సిబ్బంది చెక్ చేసి చెబుతారు. లేదంటే యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌తో నేరుగా అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రైతు బంధు మొబైల్ యాప్ కూడా ఉంది. ఈ యాప్‌తోనూ సేవలు పొందవచ్చు.* పోడు రైతులకు కూడా.. : ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కోసం రూ.7,720.29 కోట్లను విడుదల చేసింది. వర్షాకాలం సీజన్‌కు రైతుల ఖాతాల్లో ఈ నిధులను మంజూరు చేసింది. ఈ 11వ విడతలో దాదాపు 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది రైతులు కొత్తగా అర్హుల జాబితాలో చేరారు. పైగా, పోడు రైతులకు పట్టాల పంపిణీ ప్రారంభం కావడంతో వీరికి కూడా రైతుబంధు పెట్టుబడి సాయం అందుతోంది. ఇలా రాష్ట్రంలో 1.5లక్షల మంది పోడు రైతులు రైతుబంధుతో లబ్ధి పొందనున్నారు. జులై 26న ఎకరం లోపు ఉన్న రైతులకు, 27న రెండు ఎకరాలు లోపు రైతులకు, 28న మూడు ఎకరాలు, 29న నాలుగు ఎకరాలు.. ఇలా ఒక్కో ఎకరం పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది.

bottom of page