top of page

ముంబై క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం..


ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోజు నుంచి టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ఏదో ఒక విధంగా విమర్శులు వస్తూనే ఉన్నాయి. గ్రౌండ్ లోనూ, సోషల్ మీడియాలోనూ హార్దిక్ పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. రోహిత్ నుంచి కెప్టెన్సీ తీసేయడంతో మొదలైన ఈ దూషణల పర్వం.. ఆ తర్వాత ఐపీఎల్ లో ముంబై జట్టు వరుస ఓటములతో తారా స్థాయికి చేరుకుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానులు హార్దిక్ పై విచక్షణా రహితంగా దుర్భాషలాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్టేడియంలో హార్దిక్‌ను దుర్భాషలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. నిజానికి ముంబై ఇండియన్స్ సోమవారం (ఏప్రిల్1) రాజస్థాన్ రాయల్స్‌తో తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో తలపడనుంది.ఈ మ్యాచ్‌లో స్టేడియంలో హార్దిక్ ను దూషించిన అభిమానులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ట్రోలర్స్ ను గ్రౌండ్ నుంచి బహిష్కరించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథులు నిర్ణయించారు. లోక్‌మత్ మరాఠీ నివేదిక ప్రకారం, హార్దిక్‌పై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించడానికి MCA భద్రతను పెంచింది. మ్యాచ్ సమయంలో ప్రేక్షకులపై పటిష్ఠమైన నిఘా ఉంచనుంది. మ్యాచ్‌లో ఎవరైనా ప్రేక్షకులు హార్దిక్‌పై వ్యాఖ్యలు చేసినా, నినాదాలు చేసినా వారిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత అతడిని స్టేడియం నుంచి గెంటేస్తారని సమాచారం.

bottom of page