top of page
Shiva YT

‘కరువు’ యుద్ధం! 🌾🚜

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య సరికొత్త వార్ స్టార్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు.. రైతుల ఇబ్బందులపై ప్రతిపక్ష పార్టీ ఫైర్ అవుతుంటే.. తప్పంతా మీదే అంటూ రివర్స్ కౌంటర్స్ ఇస్తోంది అధికార కాంగ్రెస్.

ఓవైపు కరువు పరిస్థితులు, మరోవైపు ప్రతిపక్షం-అధికారపక్షం మధ్య డైలాగ్ వార్‌తో.. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రైతుల పంటలెండుతున్నా.. అధికార కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, అధిక వర్షాలు నమోదైనా.. పంటలకు నీళ్లిచ్చే ఇష్టం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

నీళ్లు ఇవ్వడం చేతకాక కాళేశ్వరంను సాకుగా చూపుతున్నారని విమర్శించారు కేటీఆర్. రెండు పిల్లర్ల సమస్యను చూపించి.. కాళేశ్వరం అంతా కొట్టుకుని పోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల మీద ప్రేమ ఉంటే.. కాళేశ్వరం వెంటనే రిపేర్ చేసి.. రైతులకు నీళ్లు అందించాలన్నారు కేటీఆర్.

కేటీఆర్ విమర్శలకు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడ్చల్‌ సభలో అదేస్థాయిలో కౌంటర్స్ ఇచ్చారు. పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగిలి కూలిపోయిందని రేవంత్. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 50ఏళ్లయినా చెక్కు చెదరలేదని.. బీఆర్ఎస్ లక్షకోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే కూలిందన్నారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకే.. తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారు అన్నారు రేవంత్.

bottom of page