top of page
MediaFx

ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ స్టార్.. ఎక్కడ చూడొచ్చంటే..


రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించగా పరశురామ్ పెట్ల తెరకెక్కించారు. అయితే ఇటీవల మంచి అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం మాత్రమే అందుకుంది.విషయం ఏమిటంటే, నేటి నుండి ఫ్యామిలీ స్టార్ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.


bottom of page