top of page

'ఫ్యామిలీ స్టార్' నుండి కళ్యాణి వచ్చా వచ్చా వీడియో సాంగ్ 🎵✨

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "ఫ్యామిలీ స్టార్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని కళ్యాణి వచ్చా వచ్చా వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్ మూమెంట్స్‌తో కూడిన సాధారణ ఫ్యామిలీ డ్రామా అని లేటెస్ట్ టాక్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.🎵✨


bottom of page